కామారెడ్డి వాసికి ముంబై పోలీసులు అభినందనలు, ఏం జరిగిందంటే?

Mumbai Police Appreciates Kamareddy Person In Maharashtra - Sakshi

భిక్కనూరు: మహారాష్ట్రలోని నివసిస్తున్న భిక్కనూరుకు చెందిన బూర్ల నగేశ్‌ను ముంబై పోలీసులు అభినందించారు. వివరాలు.. భిక్కనూరుకు నగేష్‌15 ఏళ్లుగా ముంబైలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం జోగేశ్వర్‌ ఈస్ట్‌ ఏరియాలోని శాటిలైట్‌ ఏస్టేట్‌లో ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆయన పక్క ఫ్లాట్‌లో డాక్టర్‌ రమేశ్‌ యాదవ్‌ దంపతులు ఉంటున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం తన పక్క ఫ్లాట్‌లోకి దొంగలు చొరబడి ఓ మహిళను కత్తితో హతమార్చబోగా నగేశ్‌ వారితో తలబడ్డాడు. మహిళను కాపాడిన నగేశ్‌ను అక్కడి పోలీసులు అభినందించారు.

నగేశ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కొరియర్‌ పేరిట అపార్టుమెంట్‌లోకి చొరబడి మహిళను తల్వార్‌తో హతమార్చేందుకు యత్నించారన్నారు. ఆమె అరవడంతో తాను వెళ్లి దొంగలతో పోరాడనని చెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. రెండో వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారని చెప్పారు.
చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి హత్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top