హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐర్(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అంశానికి సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే ముస్లింలపై ఫాం-7 ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఫాం-7 దరఖాస్తులు ఇస్తున్నారని మండిపడ్డారు. బల్క్‌గా ఫాం-7 ఇచ్చిన వారిపై కేసులు పెట్టాలంటూ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎస్‌ఐఆర్‌లో పేరు ఉండటం లేదన్నారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అసదుద్దీన్.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐర్‌పై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి నిన్న(సోమవారం, అక్టోబర్ 5వ తేదీ)హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫారం-6, 6A, 7, 8లో తప్పుడు ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రధానంగా ఫారం-7లో బల్క్ దరఖాస్తుల అంశానికి సంబంధింది ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TG: ఎస్‌ఐఆర్‌పై సీఈవో కీలక ఆదేశాలు


