
కోతుల గలాటాతో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
చిగురుమామిడిలో 14 ఇళ్లలో మీటర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు దగ్ధం
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి బస్టాండ్ వెనకాల ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద శుక్రవారం వానరాలు బీభత్సం సృష్టించాయి. మర్కటాల గలాటా లో ప్రమాదవశాత్తు ఓ వానరం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఉన్న 14 ఇళ్లలో విద్యుత్‌మీటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయాయి.
ట్రాన్స్‌ఫార్మర్‌పై వానరం పడి మృతి చెందగా తోటి వానరాలు దానిచుట్టూ మూగా యి. ట్రాన్స్‌కో సిబ్బంది కాలిపోయిన మీటర్లు, ఇతర సామగ్రిని పరిశీలించారు. తక్షణ మరమ్మతులు చేసినప్పటికీ.. సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్ మొరాయించిందని గ్రామస్తులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు ముందురోజే గ్రామానికి చెందిన సూరం బాల్‌రెడ్డి వానరాల దాడిలో గాయపడి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు.