హైదరాబాద్‌: బ్లైండ్‌ స్కూల్‌లో విషాదం | Mishap At Hyderabad Begumpet Blind Hostel | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: బేగంపేట బ్లైండ్‌ స్కూల్‌లో విషాదం

Feb 23 2023 9:27 PM | Updated on Feb 23 2023 9:32 PM

Mishap At Hyderabad Begumpet Blind Hostel  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కేర్‌ టేకర్‌ లేనిటైంలో.. ఆరో అంతస్థు నుంచి కిందపడి విద్యార్థి.. 

సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ అంధ విద్యార్థుల స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. గురువారం బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది.

కేర్ టేకర్ బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో..  లక్ష్మి గౌతమ్ శ్రీకర్(12) అనే ఆరో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. ఈ క్రమంలో కిందపడి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement