బాలాపూర్‌లో ఆరు అడుగుల వినాయకుడు | Minister Sabitha Indra Reddy Visited Balapur Ganpati | Sakshi
Sakshi News home page

బాలాపూర్‌లో ఆరు అడుగుల వినాయకుడు

Aug 23 2020 10:47 AM | Updated on Aug 23 2020 11:02 AM

Minister Sabitha Indra Reddy Visited Balapur Ganpati - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రసిద్ధ బాలాపూర్‌ గణేశున్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. గణేశునికి సబితా ఇంద్రారెడ్డి తొలి రోజు(శనివారం) పూజ చేశారు. ఆమెతో పాటు మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి పూజ చేసిన మంత్రి సబితా రెడ్డి.. ప్రజలందరిని కరోనా నుండి కాపాడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లడ్డూ వేలం రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement