హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది కాదు: కేటీఆర్‌

Minister KTR Talk On HICC Brand Hyderabad Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో హైదరాబాద్‌ నగర శాంతిభద్రతలు బాగున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని అత్యున్నతస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆయన ఆదివారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన బ్రాండ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అద్భుత నగరమని, ప్రకృతి వైపరిత్యాలు లేని ప్రాంతమని తెలిపారు. పెట్టుబడులకు అనుకూల ప్రాంతం హైదరాబాద్‌ అని  పేర్కొన్నారు. 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు పెరిగాయని, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ హైదరబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. పెట్టుబడుదారులకు హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమెజాన్‌ కంపెనీతో అనేక చర్చలు జరిపి వారికి నమ్మకాన్ని కల్పించామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రగతికి పట్టం కట్టండి : కేటీఆర్‌

హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కాదని, భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. హైదరాబద్ భారత దేశంలోనే అత్యంత అరుదైన, చారిత్రాత్మక నగరమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందని, ఆరేళ్ల కింద హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవన్నారు. హైదరాబాద్‌లో గొడవలు వద్దు అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ తెలంగాణ గడ్డకు చెందినవాడే అని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. చదవండి: గ్రేటర్‌ బరి: మేయర్‌ పీఠంపై మహిళ గురి

నోయిడా, ఘజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాతవారికి కూడా సమున్నత స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టామని, ఐదు టాప్ ఫైవ్ కంపెనీలు గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్‌, ఫేస్‌బుక్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని ఆయన గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ గొప్పతనమని, దాన్ని కాపాడుతున్నామని తెలిపారు. ఇక్కడ పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమానికి (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) హైసియా అధ్యక్షుడు మోడరేటర్‌గా వ్యవహరించారు. చదవండి: బీజేపీలోకి బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీక..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top