కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి

Minister KTR Released 7th Annual Report Of IT In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. '' విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలి. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యం. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

ఇక 2020-21కి సంబంధించిన ఐటీశాఖ వార్షిక నివేదికను పారదర్శకత కోసం విడుదల చేశాం. క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సాధించాం.అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికం. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశాం'' అని తెలిపారు.
చదవండి: భాష వివాదంపై మంత్రి కేటీఆర్‌ స్పందన

ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top