ఓటీటీపై తన అభిప్రాయమేంటో చెప్పిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Participated In Inaugural Etelavent of Indiajoy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విజువ‌ల్ ఎఫెక్ట్స్, యానిమేష‌న్ అండ్ గేమింగ్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇండియా జాయ్ పేరుతో మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫెస్టివ‌ల్ హైద‌రాబాద్‌లో మంగళవారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, హీరో సుధీర్‌బాబుతోపాటు గేమింగ్, యానిమేష‌న్ రంగ నిపుణులు, పారిశ్రామిక‌వేత్త‌లు, పెట్టుబ‌డిదారులు హాజ‌ర‌య్యారు. కాగా ఇండియా జామ్‌ ఆసియాలోనే అతిపెద్ద డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫెస్టివ‌ల్‌.

చదవండి: మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్‌..

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇండియా జాయ్ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ కార్య‌క్ర‌మం అని కొనియాడారు. దేశంలో రోజురోజుకు ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు పెరిగిపోతున్నారని అన్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4 శాతం పెరుగుతోంద‌ని అంచ‌నా ఉన్న‌ట్లు తెలిపారు. ఓటీటీ, గేమింగ్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని. తాను కూడా ఓటీటీకి అభిమానిని అని వెల్లడించారు. వీక్ష‌కుల‌కు వినోదం ఇవ్వ‌డంలో ఓటీటీ విజ‌య‌వంత‌మైంద‌న్నారు. రెండేండ్ల‌లో కొత్త‌గా 10 వీఎఫ్ఎక్స్ సంస్థ‌లు కొలువుదీరాయ‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో 80 వీఎఫ్ఎక్స్ సంస్థ‌లు ఉన్నాయి. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా న‌గ‌రంలో అనేక గేమ్స్ రూపొందాయ‌న్నారు. ఇమేజ్ ట‌వ‌ర్‌ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top