‘హుస్సేన్ సాగర్‌ బోటు ప్రమాదం.. రిపోర్ట్‌ ఎందుకివ్వలేదు?’ | Minister Jupally Krishna Rao Angry Over Hussain Sagar Boat Accident | Sakshi
Sakshi News home page

‘హుస్సేన్ సాగర్‌ బోటు ప్రమాదం.. రిపోర్ట్‌ ఎందుకివ్వలేదు?’

Jan 30 2025 7:44 PM | Updated on Jan 30 2025 8:15 PM

Minister Jupally Krishna Rao Angry Over Hussain Sagar Boat Accident

హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నెక్లెస్ రోడ్డులో జరిగిన మహా హారతి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్‌లోని బోటులో క్రాకర్స్ ఎవరి అనుమతితో కాల్చారంటూ ప్రశ్నించిన మంత్రి.. ప్రమాదంపై  తనకు ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు.

తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. టూరిజం బోటులో బాణాసంచా ఎలా అనుమతి ఇస్తారంటూ మండిపడ్డ మంత్రి.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించేందుకు జూపల్లి కృష్ణారావు ప్రయత్నించగా, జూపల్లి ఫోన్‌కు కిషన్‌రెడ్డి స్పందించలేదు. బోటు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయాన్ని జూపల్లికి తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు.

కాగా, సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్‌ ఇన్‌చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు సమాచారం.

ఇదీ చదవండి: బోటు ప్రమాదం.. కన్నతల్లి కన్నీటి వ్యథ

 

Advertisement
 
Advertisement
Advertisement