
తొర్రూరులో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, తొర్రూరు: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ పార్టీ పేరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరిచిపోయారు. బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు దసరా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ ఏమిటని.. ప్రజలను ప్రశ్నించగా.. ఒకరు బీఎస్పీ అని సమాధానమిచ్చారు. మంత్రి సైతం బీఆర్‌ఎస్ బదులు బీఎస్పీ అని పలకడం విశేషం. ఆయన పార్టీ పేరు మరిచిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: (KCR BRS Party: 'బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం')