KCR BRS Party: 'బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పోటీ చేయించబోం'

BRS has no plans to contest Karnataka Assembly Polls - Sakshi

కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్‌ అండ

కుమారస్వామి స్పష్టీకరణ

సాక్షి, బెంగళూరు(శివాజీనగర): కర్ణాటకలో 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పోటీ చేయించబోమని జేడీఎస్‌ నేత హెచ్‌.డి.కుమారస్వామి స్పష్టం చేశారు. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్‌ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు.

ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న కోలారు, రాయచూరుతో పాటు సరిహద్దు ప్రాంతాల నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు అన్ని విధాలా సహకారం అందించనున్నారని వివరించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో 150 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ చేయవచ్చని, దీంతో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు జరగవచ్చని అభిప్రాయపడ్డారు. తాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోమని స్పష్టం చేశారు. తమది చిన్న పార్టీ అని.. కర్ణాటకలో మాత్రమే పోటీలో ఉంటామని కుమారస్వామి పేర్కొన్నారు.  

చదవండి: (బీఆర్‌ఎస్‌గా పేరు మార్చండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top