పాతబస్తీలో పతంగ్‌ జోరేనా...! | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పతంగ్‌ జోరేనా...!

Published Sat, Dec 2 2023 11:14 AM

mim party tough competition in election - Sakshi

చార్మినార్: పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలు మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో లాగే మజ్లిస్‌ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లిస్‌ పార్టీ బలం–అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే. చార్మినార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ పార్టీ అభ్యరి్థకి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ సరళి మారి మజ్లిస్‌ పార్టీకి అనుకూలంగా ఏర్పడింది. యథేచ్ఛగా బోగస్‌ ఓట్లు పోలయ్యాయి. ఎక్కడా గుర్తింపు కార్డుల కోసం సంబంధిత అధికారులు విచారణ (అడగకపోవడం) చేయకపోవడంతో ఎవరు పడితే వారు స్లిప్‌లతో బోగస్‌ ఓట్లు వేశారు. యాకుత్‌పురాలో మజ్లిస్‌ పారీ్టకి ఎంబీటీ గట్టి పోటీనిచి్చంది.  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే.. 
► యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎంబీటీ అభ్యరి్థగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్‌ అంజదుల్లాఖాన్, మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి మాజీద్‌ హుస్సేన్‌ మేరాజ్‌కి గట్టి పోటీ నిచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం మజ్లిస్‌ పార్టీకి కంచుకోట. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు మార్పును కోరుతుండటంతో మజ్లిస్‌ పార్టీకి కాకుండా ఎంబీటీకి అధిక సంఖ్యలో ఓట్లు పోలైనట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీకి ఈసారి యాకుత్‌పురా నుంచి టికెట్‌ దక్క లేదు. ఆయన స్థానంలో నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌ మేరాజ్‌కు టికెట్‌ లభించడం.. ఆయన స్థానికేతరుడు కావడంతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్‌ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

  అయితే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మజ్లీసేతర పారీ్టలైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సామా సుందర్‌రెడ్డి కేవలం ఐఎస్‌ సదన్‌ డివిజన్, గౌలిపురా డివిజన్‌లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి.. మిగిలిన డివిజన్‌లలోని ఓటర్లకు అతని ముఖం ఎలా ఉంటుందో చూపించ లేదు.
 
►  ఇక బీజేపీ అభ్యర్థి వీరేందర్‌ యాదవ్‌ సైతం గౌలిపురా, కుర్మగూడ డివిజన్‌లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఐఎస్‌సదన్‌ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. 

► యాకుత్‌పురా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రవిరాజ్‌ అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించ లేదు. కేవలం ఒకటి రెండు చోట్ల పాదయాత్రలు నిర్వహించిన ఆయన ఒక దశలో ఎన్నికల కార్యాలయానికి తాళాలు వేసి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
►    ఇలా యాకుత్‌పురాలో మజ్లీసేతర పారీ్టలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే. చారి్మనార్‌లో మజ్లిస్‌కు గట్టి పోటీనిచి్చన కాంగ్రెస్, బీజేపీ..  

► చార్మినార్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్‌ పోటాపోటీగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ..మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి మీర్‌ జులీ్ఫకర్‌ అలీ విజయం సాధించనున్నారు. 

► ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ సలావుద్దీన్‌ లోధీ నామమాత్రమే. 

చాంద్రాయణగుట్టలో మజ్లిస్‌కు పోటీ నిచ్చిన బీజేపీ.. 
► చాంద్రాయణగుట్టలో ఈసారి కూడా మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించనున్నారు.  

► బీజేపీ తరఫున భాగ్యనగర్‌ గణేష్‌ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్‌ ఎన్నికల బరిలో ఉండి ప్రచారంలో దూసుకు పోయారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

►  చాంద్రాయణగుట్టలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వీరిరువురి ముఖాలు సైతం నియోజకవర్గం ఓటర్లకు తెలియకుండా పోయింది. 

బహదూర్‌పురాలో కనిపించని బీఆర్‌ఎస్‌..  
► బహదూర్‌పురా నియోజకవర్గం మజ్లిస్‌ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి మజ్లిస్‌ పార్టీ జెండాపై ఎవరూ పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం నుంచి హాట్రిక్‌ సాధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొజంఖాన్‌కు ఈసారి టికెట్‌ లభించ లేదు. ఈయన స్థానంలో మోబిన్‌ ఎన్నికల బరిలో దిగగా.. భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.  

►  ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్కుమార్‌ గట్టిగా పోటీనిచ్చారు.  
► ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీర్‌ ఇనాయత్‌ అలీ బాక్రీతో పాటు బీజేపీ అభ్యర్థి వై.నరేష్‌ల పోటీ నామమాత్రమే.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement