ఎంజీఎంలో విద్యుత్‌ అంతరాయం.. పేషెంట్‌ మృతి

MGM Hospital Power Cut Patient Is No More - Sakshi

హన్మకొండ:  వరంగల్‌ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్‌ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు.

ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్‌ ఆన్‌ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు.

చదవండి: తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top