కీవ్: రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్‌లోని వేలాది నివాసాల్లో ఆదివారం చీకట్లు అలుముకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలతో తీవ్ర శీతల వాతావరణంలో హీటింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో జనం అల్లాడుతున్నారు. విద్యుత్ సరఫరా లైన్లే లక్ష్యంగా ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల కారణంగా జపొరిఝియా ప్రాంతంలోని 400 గ్రామాల్లోని 2 లక్షలకు పైగా నివాసాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మరోవైపు, సుమీ, ఖర్కీవ్, ఒడెసా, నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతాలపై శనివారం రాత్రి విద్యుత్ పవర్ గ్రిడ్‌పై రష్యా డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది.


