అనుమానంతో భార్యను అంతం చేశాడు | married woman ends life in hyderabad | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను అంతం చేశాడు

Jun 11 2025 7:59 AM | Updated on Jun 11 2025 7:59 AM

married woman ends life in hyderabad

చైతన్యపురి(హైదరాబాద్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తన భార్యను మెడకు  చున్నీ బిగించి హతమార్చాడు ఓ వ్యక్తి. సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి  వివరాలు వెల్లడించారు. 

భాగ్యనగర్‌ కాలనీలో అమ్ములు (30), మరియదాస్‌లు నివాసముంటున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు.  మరియదాస్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అమ్ములు ఇండ్లలో  సనిచేస్తోంది. బార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి  వివాహేతర సంబంధ అనుమానాలు ఉన్నాయి.  కొంత కాలంగా ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరుగుతోంది.. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో గొడవ పెట్టుకున్నారు. 

మంగళవారం మధ్యాహ్నం మరియదాస్‌.. అమ్ములు మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఇదే విషయాన్ని మరియదాస్‌ ఎదురు ఇంట్లో ఉండే మామ అర్జునుడుకి సమాచారం ఇచ్చాడు. దీంతో అర్జునుడు వారి ఇంటికి వెళ్లి చూడగా కూతురు  విగతజీవిగా ఉండటం గమనించాడు. సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement