భర్త, పిల్లల దగ్గరికి రాకుండా... లావణ్య ఎక్కడ వెళ్ళింది | Sakshi
Sakshi News home page

భర్త, పిల్లల దగ్గరికి రాకుండా... లావణ్య ఎక్కడ వెళ్ళింది

Published Wed, Jan 3 2024 12:00 PM

married missinig in hyderabad - Sakshi

హైదరాబాద్: భర్త, పిల్లల దగ్గరకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ గృహిణి తిరిగిరాని సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. బాలానగర్‌ సీఐ కె. భాస్కర్‌ తెలిసిన వివరాల ప్రకారం... రాజకుమార్‌ లావణ్య దంపతులు ఫిరోజ్‌గూడలో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.

భర్త, పిల్లలు ఊరికి వెళ్లటంతో వారిని కలిసేందుకు సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే ఆమె భర్త, పిల్లలను కలవలేదు. ఆమె ఆచూకీ లభించకపోవటంతో పలు చోట్ల గాలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement