ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి రాజీనామా | Marri Shashidhar Reddy Quits As TPCC Election Coordination Committe | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి రాజీనామా

Jun 28 2021 3:07 AM | Updated on Jun 28 2021 3:07 AM

Marri Shashidhar Reddy Quits As TPCC Election Coordination Committe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. తనను ఈ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారని, ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైనందున ఆయన స్వేచ్ఛగా వ్యవహరించే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని శశిధర్‌ రెడ్డి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement