Manneguda Kidnap Case: Naveen Reddy Mother Cries - Sakshi
Sakshi News home page

ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు: నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన

Dec 10 2022 1:35 PM | Updated on Dec 10 2022 2:55 PM

Manneguda Kidnap Case: Naveen Reddy Mother Cries - Sakshi

విలపిస్తూ స్పృహ కోల్పోయిన నవీన్‌రెడ్డి తల్లి

ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు. అయినా సరే ఆమె కోడలిగా.. 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్‌ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలి-నవీన్‌రెడ్డికి చెందిన వాళ్లు.. ఎవరి వెర్షన్‌లో వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం నవీన్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది.

రెండేళ్లుగా వైశాలి-నవీన్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది.. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది. ‘‘నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు.  ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు.  పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్‌ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నారాయణమ్మ.

ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్‌ అండ్‌ డౌన్‌ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నవీన్‌రెడ్డి చెప్పాడు. అయితే.. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారంలాంటిదేం నడవలేదని వైశాలి కుటుంబం చెబుతోంది. నవీన్‌రెడ్డి ప్రేమ పేరుతో వైశాలిని వేధించాడని చెబుతోంది. ఈ తరుణంలో అన్ని విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఇదీ చదవండి: మన్నెగూడ కిడ్నాప్‌ ఘటన.. వైశాలి కుటుంబానికి భద్రత కల్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement