ప్రేమను పెద్దలు అంగీకరించలేదని.. | Love couple Ends Life In Sangareddy | Sakshi
Sakshi News home page

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..

Jun 18 2025 1:17 PM | Updated on Jun 18 2025 1:26 PM

Love couple Ends Life In Sangareddy

ప్రేమ జంట ఆత్మహత్య  

అవుసులోనిపల్లిలో విషాదం

వర్గల్‌(గజ్వేల్‌): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్‌ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. 

అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్‌ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్‌ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్‌ మనస్తాపానికి గురయ్యారు. 

మంగళవారం ఉదయం శివకుమార్‌ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.  

  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement