సాక్షి, అనకాపల్లి జిల్లా: మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో యువ జంట మృతి చెందారు. నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను డొంగల సత్యసాగర్, షీలా అరుణగా గుర్తించారు. సత్యసాగర్ షీలా అరుణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు మైనర్లు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లికి అంగీకరించకపోవడంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యసాగర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: భార్య అరిచిందని.. భర్త షాకింగ్ నిర్ణయం


