కుమారి ఆంటీ హోటల్‌ రీ ఓపెన్‌ | Sakshi
Sakshi News home page

కుమారి ఆంటీ హోటల్‌ రీ ఓపెన్‌

Published Sun, Feb 4 2024 7:35 AM

Kumari Aunty Hotel re-opened - Sakshi

హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్‌ తెరుచుకుంది. ఐటీ కారిడార్‌లో కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ట్రాఫిక్‌జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్‌ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్‌ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

సోషల్‌ మీడియాలో కుమారి ఆంటీ హోటల్‌ తొలగింపు వైరల్‌ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్‌ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement