కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్‌’ సీరియస్‌ వార్నింగ్‌ | KTR Serious On Khammam TRS Corporators | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్‌’ సీరియస్‌ వార్నింగ్‌

Jun 11 2022 4:42 PM | Updated on Jun 11 2022 5:12 PM

KTR Serious On Khammam TRS Corporators - Sakshi

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ క్లాస్‌ పీకారు. కొందరు కార్పొరేటర్ల పనితీరు సరిగా లేదంటూ హెచ్చరించారు.

సాక్షి, ఖమ్మం: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌ను మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

అనంతరం, ఖమ్మం నూతన మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు క్లాస్‌ ఇచ్చారు. కొందరు కార్పొరేటర్ల పనితీరు సరిగా లేదు. ఇంట్లో కూర్చుంటే కుదరదు. మంచిగా పనిచేసి ప్రజల మనసును గెలుచుకోవాలి. వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలను పరిష్కరించాలి అని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ఫై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement