ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకులాల సమస్యలపై పోరుబాట
వచ్చే నెల నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్ ఆందోళన
ఈ నెల 29న యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ఘనంగా ‘దీక్షా దివస్’
బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ కీలక సమావేశం
దీక్షా దివస్ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థులు ఉద్యమ రణభేరి మోగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యారంగం అభిృద్ధికి బీఆర్‌ఎస్ ఎలాంటి కృషి చేయలేదంటూ కాంగ్రెస్ చేస్తున్న అబ ద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
వేలా ది మంది విద్యార్థులను సమీకరించి ప్రతీ అసెంబ్లీ ని యోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నందినగర్ నివాసంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.
సమకాలీన రాజకీయాలపై స్పందించండి
‘ప్రతీ విద్యార్థి సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండి సమకాలీన రాజకీయాలపై గట్టిగా స్పందించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచి్చన హామీపై యువతను జాగృతం చేయాలి.
పార్టీ అధినేత చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో మహా ఘట్టంగా నిలిచిపోతుంది. విద్యార్థులు, అమరుల త్యాగ ఫలితం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైంది. నవంబర్ 29న పార్టీ చేపడుతున్న దీక్షా దివస్‌ను అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ అవినీతి కోసమే ‘హిల్ట్ పి’
‘పారిశ్రామిక భూముల బదలాయింపు పాలసీ ‘హిల్ట్ పి’పేరిట 9,292 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపింది. గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలకు ఇచి్చన భూములను ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే యత్నం జరుగుతోంది. హిల్ట్ పి ద్వారా అంబానీ సరసన నిలిచేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ భూదందాపై ప్రజలను జాగృతం చేసేలా విద్యార్థి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ రూపొందించిన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


