ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా | KTR hails Gravton Motors success journey from Sircilla to global markets | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా

Oct 13 2025 5:47 AM | Updated on Oct 13 2025 5:47 AM

KTR hails Gravton Motors success journey from Sircilla to global markets

ఈవీ ఆవిష్కరణలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్‌ మోటార్స్‌ వ్యవస్థాపకుడు  

పర్శురామ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశంస

సిరిసిల్ల: తెలంగాణలోని ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్‌ మోటార్స్‌ వ్యవస్థాపకుడు పర్శురామ్‌ పాకను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతా లు జరుగుతాయని కేటీఆర్‌ ‘ఎక్స్‌’వేదికగా ఆదివారం పోస్ట్‌ చేశారు. పర్శురామ్‌ వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో టీ–హబ్, టీ–వర్క్స్‌ పాత్ర కీలకమని కొనియాడారు.  

సిరిసిల్ల నుంచి...: ‘సిరిసిల్లకు చెందిన పర్శురామ్‌ది ఇంజినీరింగ్‌లో నేపథ్యం. మన ఇంక్యుబేటర్ల (టీ–హబ్, టీ–వర్క్స్‌) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకొని గ్రావ్టన్‌ మోటార్స్‌ను స్థాపించారు.

నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచస్థాయి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తోంది’అని కేటీఆర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గ్రావ్టన్‌ మోటార్స్‌ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్‌ సిస్టమ్స్‌ను పూర్తిగా దేశీయంగా రూపొందించిందన్నారు.  

కే2కే ప్రపంచ రికార్డ్‌: గతంలో గ్రావ్టన్‌ మోటార్స్‌ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్‌ టు కన్యాకుమారి (కే2కే) రైడ్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తన కార్యకలాపాలను విస్తరిస్తోందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కోయంబత్తూరులో పర్శురామ్‌ను శుక్రవారం కలిశానని, వారి కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని కేటీఆర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement