‘22A అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరగాలి’ | KTR calls for a judicial inquiry into the irregularities | Sakshi
Sakshi News home page

‘22A అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరగాలి’

Sep 15 2026 6:06 PM | Updated on Sep 15 2026 6:38 PM

KTR calls for a judicial inquiry into the irregularities

సాక్షి, ఢిల్లీ: 22A అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైయిరీ జరగాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లపాటు సెటిల్మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారన్న ఆయన రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనక ఒక పెద్ద స్కాం ఉంటుందని ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ.."భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారు. 30% కమిషన్లు  తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఉమ్మడి పౌరస్మృతిపై మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. యూనిఫామ్ అని చెప్పి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలోనే చట్టం తీసుకు వస్తామనడంలో సహితుకత లేదు" అని ప్రభుత్వాన్ని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement