ఎన్నికల వేళ సినిమా రేంజ్‌లో పోలీసులు ఛేజింగ్‌.. భారీగా డబ్బు స్వాధీనం | Telangana Lok Sabha Elections: Khammam Police Recovered Crores Money In Innova Car, Photos Goes Viral| Sakshi
Sakshi News home page

Telangana Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ సినిమా రేంజ్‌లో పోలీసులు ఛేజింగ్‌.. భారీగా డబ్బు స్వాధీనం

May 12 2024 12:09 PM | Updated on May 12 2024 12:32 PM

Khammam Police Recovered Crores Money In Innova Car

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సినిమా ఫక్కీలో ఓ ఇన్నోవా కారును ఛేజ్‌ చేసి డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వెంబడించారు. 

ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. మరికొన్ని గంటల్లోనే పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలో జరిగే అవకాశం ఉంది. డబ్బు తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement