వృద్ధ దంపతుల సమస్యకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల సమస్యకు పరిష్కారం

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

వైరారూరల్‌: పోషణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, తన ఆస్తి తిరిగి అప్పగించాలని ఓ వృద్ధుడు చేసిన వినతితో అధికారులు స్పందించారు. వైరా మండలం నారపునేనిపల్లికి చెందిన వృద్ధుడు కొమ్మవరపు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, పెద్ద కుమారుడు ఆస్తి తీసుకోని ఇంటి నుంచి వెళ్లగొట్టగా కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన కలెక్టర్‌ దివాకరకు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైరా తహసీల్దార్‌ సీహెచ్‌.సురేష్‌ మంగళవారం వెంకటేశ్వర్లు కుటుంబీకులను పిలిపించారు. ఆయనకు 1–15 ఎకరం భూమితో పాటు నెలకు రూ.వేయి నగదు కుమారులు ఇచ్చేలా ఒప్పించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఓ సునీల్‌ కుమార్‌, సర్పంచ్‌ శీలం చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి

బోనకల్‌: విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఇంటర్‌ వార్షిక ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి(డీఐఈఓ) కె.రవిబాబు సూచించారు. బోనకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరా తీశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశపెట్టిన నూతన సిలబస్‌కు అనుగుణంగా పాఠాల బోధన, అంతర్గత మూల్యాంకనం, ప్రాక్టికల్స్‌ నిర్వహణపై అధ్యాపకులకు సూచనలు చేశారు. విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చూడాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ నళినిశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement