కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనందున, కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, ప్రజలను ఆదుకోవా లని ఏఐకేఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జే.వీ.చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యాన మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చలపతి రావు మాట్లాడుతూ కరువు ఛాయలు వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, క్షేత్రస్థాయిలో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, నాయకులు ఖాసిం, శీలం సుదర్శన్‌, సురేష్‌, ఎం.గిరి, మురళి, లింగయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో ఏఐకేఎంఎస్‌

జాతీయ ప్రధాన కార్యదర్శి చలపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement