జంతువుల వేటకు యత్నించిన నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జంతువుల వేటకు యత్నించిన నలుగురి అరెస్ట్‌

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

కారేపల్లి: విద్యుత్‌ తీగల సాయంతో అటవీ జంతువుల వేటకు ప్రయత్నించిన నలుగురిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈమేరకు మంగళవారం ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు.. మండలంలోని అప్పాయిగూడెంలో ఈనెల 24న రాత్రి తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో విద్యుత్‌ ఉద్యోగులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయిల్‌పామ్‌ తోటలో జంతువుల వేట కోసం ఏర్పాటుచేసిన విద్యుత్‌ వైర్లను గుర్తించారు. మాధారం గ్రామానికి చెందిన పబ్బుల రాములు, భూక్యా రఘు, రెడ్డిబోయిన వెంకన్న, ఎల్లిబోయిన నాగేశ్వరరావు ఈ వైర్లను ఏర్పాటు చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్‌ఆర్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement