పాల్వంచరూరల్: హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా వాలీబాల్ టోర్నీలోపాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన క్రీడా పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఎంపిక పోటీలకు 65మంది బాలురు, 37మంది బాలికలు హాజరుకాగా, ప్రతిభ చూపిన 14మంది చొప్పున క్రీడాకారులతో జట్లను ఎంపిక చేశారు. తొలుత ఎంపిక పోటీలను ఏటీడీఓ చంద్రమోహన్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జట్ల వివరాలను ఉమ్మడి జిల్లా ఖేలో ఇండియా వాలీబాల్ ఎంపికల ఇన్‌చార్జ్ సుధాకర్ వెల్లడించారు. ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య, ఐటీడీఏ క్రీడల అధికారి గోపాల్‌రావు, పాఠశాల హెచ్‌ఎం చందు, పీడీలు, పీఈటీలు బట్ట హరికృష్ణ, భద్రం, రాంబాబు, పవన్‌కుమార్, ఎం.రాకేష్ తదితరులు పర్యవేక్షించారు.


