వైరా: ముందు వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ అయి ఆగిపోగా వెనకాల గ్రానైట్ రాళ్ల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆపై రాయి జారి క్యాబిన్‌పై పడడంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వైరా సమీపాన మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడ్‌తో వస్తున్న లారీ కల్లూరు వైపు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. గ్రానైట్ లారీపై ఉన్న పెద్ద రాయి జారి క్యాబిన్‌పై పడగా లారీ నడుపుతున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్మూమ్ జిల్లా ఖిదిర్‌పూర్‌కు చెందిన షేక్.అనికూల్(29) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో రాళ్లు రోడ్డుపై పడగా దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎస్‌ఐ పి.రామారావు సిబ్బందితో చేరుకుని వాహనాలను సోమవరం ఎగ్జిట్ నుంచి వైరా మీదుగా తరలించారు. అనంతరం జేసీబీ సాయంతో రాళ్లు తొలగించి, డ్రైవర్‌ను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.
గ్రానైట్ రాళ్లు పడడంతో డ్రైవర్ మృతి


