తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ | Justice Ujjal Bhuyan Transferred As Judge Of Telangana High Court | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

Oct 6 2021 2:29 AM | Updated on Oct 6 2021 2:29 AM

Justice Ujjal Bhuyan Transferred As Judge Of Telangana High Court - Sakshi

జస్టిస్‌ రామచంద్రరావు- జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

తెలంగాణ ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీ రామచంద్రరావును పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలం గాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావును పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాను, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

Advertisement
 
Advertisement
Advertisement