మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు | IT Raids At DSR Group Owners EX MP ranjith Reddy House Offices Details | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Aug 19 2025 11:28 AM | Updated on Aug 19 2025 11:55 AM

IT Raids At DSR Group Owners EX MP ranjith Reddy House Offices Details

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆ సంస్థలో భాగస్వామిగా ఉన్న రంజిత్‌ రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. 

ఈ ఉదయం నుంచి డీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ట్యాక్స్‌ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాల నేపథ్యంలో.. గడిచిన ఐదేళ్లలో పన్నుల చెల్లింపుల ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ ఎండీ సుధాకర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరెడ్డి ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ,ఎస్సార్‌ నగర్‌, సూరారంలో.. అదీ సీఆర్‌పీఎఫ్‌ బలగాల నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement