KCR Warangal Visit: Intelligence Inquires into Incidents Happend During CM Warangal Visit - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?

Jun 26 2021 1:24 PM | Updated on Jun 26 2021 6:18 PM

Intelligence Inquires into Incidents Happend During CM Warangal Visit - Sakshi

కాలినడకన వస్తున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి(ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ పర్యటన వరంగల్‌ చరిత్రలో మిగిలిపోయేలా సాగింది. అయితే, ఆద్యంతం ఉల్లాసంగా సాగిన ఆయన పర్యటనను అందరూ నెమ్మదిగా మరచిపోయే తరుణంలో ఆ రోజు జరిగిన పరిణామాలపై సీఎంఓ వర్గాలు సమగ్ర నివేదిక కోరడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన సందర్బంగా ఐదు రోజుల ముందు నుంచే కసరత్తు చేసినా.. ఆ రోజు చోటుచేసుకున్న చెదురుముదురు సంఘటనలు, వాటికి గల కారణాలను పోలీసు, ఇంటలిజెన్స్‌ వర్గాల విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా కట్టడి చేసినప్పటికీ సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో హఠాత్తుగా కొన్ని విద్యార్థి సంఘాల బాధ్యులు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు.

పెద్ది.. అడ్డగింత
సీఎం కేసీఆర్‌ పర్యటనలో పాల్గొనేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొనేందుకు వస్తుండగా ఆయన వాహనాన్ని కేయూ క్రాస్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుండి సర్క్యూట్‌ గెస్ట్‌ హౌస్‌ సమీపంలోని మినిస్టర్‌ క్యాంపు కార్యాలయం వరకు ఆయన గన్‌మెన్లతో కలిసి నడిచి వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత జయశంకర్‌ వర్దంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏకశిల పార్కు వద్దకు వెళ్లిన సందర్భంగా కూడా మరోసారి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జయశంకర్‌కు నివాళులరి్పంచేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్న సందర్బంగా ఎవరినీ పంపించబోమని పోలీసులు తేల్చిచెప్పారు.

కాగా, తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, సీఎం కేసీఆర్‌ రాక సందర్బంగా ట్రాఫిక్‌ ఆంక్షలు, వారి భద్రత  దష్ట్యా పోలీసులకు, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నడిచి వెళ్లానని ఆయన అదే రోజు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలపై సీఎంఓ వర్గాలు నివేదిక కోరడం, ఇంటలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపిన పోలీసులను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న ఓ పోలీసు అధికారిని వాగ్వాదానికి దిగగా... అసలేం జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.  
చదవండి: వరంగల్‌ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement