ఇన్‌స్టాగ్రామ్‌లో చీర ఆర్డర్‌.. రీఫండ్‌ లింక్‌తో రూ.37 వేల టోకరా | Instagram Saree Order Turns Costly, Woman Loses ₹37,447 In Refund Link Scam In Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌లో చీర ఆర్డర్‌.. రీఫండ్‌ లింక్‌తో రూ.37 వేల టోకరా

Jun 15 2026 10:47 AM | Updated on Jun 15 2026 11:32 AM

Instagram Saree Order Turns Costly: Woman Loses ₹37,447 in Refund Link Scam

హైదరాబాద్: ఇన్‌స్ట్రాగామ్‌ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్‌ పెడితే యువతిని సైబర్‌ మోసగాళ్లు లింక్‌ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్‌ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్‌ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్‌ చేసింది. 

వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్‌ సిల్క్‌ శారీస్‌ పేరుతో రీఫండ్‌ లింక్‌ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్‌ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి  నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్‌కార్డును బ్లాక్‌ చేసింది. అప్పటికే సైబర్‌ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement