
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్‌తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు.
అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.