నకిలీ తాళం చెవి చేయించి చోరీ | Incident in Gachibowli | Sakshi
Sakshi News home page

నకిలీ తాళం చెవి చేయించి చోరీ

Aug 22 2026 5:46 AM | Updated on Aug 22 2026 5:46 AM

Incident in Gachibowli

చోరీ వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం

ఇద్దరు నిందితులు అరెస్ట్‌

గచ్చిబౌలి: ఓ ఇంట్లో నివాసముంటున్న దంపతులు గురువారం ఉదయం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ భూపతి తెలిపిన మేరకు.. శివపురి కాలనీలో నివాసం ఉండే మాధురి దంపతులు పెద్దమ్మ ఆలయానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళం తీసి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. రాయదుర్గం డీఐ రాంరెడ్డి సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళను గుర్తించారు. 

మణికొండలో నివాసం ఉంటున్న, వంటమనిషిగా పనిచేసే కర్ణాటకకు చెందిన కామేటీ లక్ష్మి (37)గా తేల్చారు. అదే ప్రాంతలో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తన బంధువు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వకలపురి శివ రాఘవేంద్ర (29)తో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించింది. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా లొకేషన్‌ గుర్తించి శివ రాఘవేంద్రను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 7 తులాల బంగారు బ్రాస్లెట్లు (2), చైన్‌లు (2) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆధార్‌ కార్డు చూపించి.. ఇల్లు మాదే అని నమ్మించి
శివపురి కాలనీలో రెక్కీ నిర్వహించిన లక్ష్మి ఇంటికి తాళం వేసినట్లు గమనించింది. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి ముందుకు వెళ్లి చూసింది. తాళం చెవి తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్లారు. ఆధార్‌ కార్డు చూపించి ఆ ఇల్లు మాదేనని నమ్మించి ఆధార్‌ కార్డు ఇచ్చింది. దీంతో అతను తాళం చెవి చేసి ఇచ్చాడు. లోపలికి వెళ్లి నగలు తస్కరించి అక్కడి నుంచి ఉడాయించారు. చోరీ చేసిన అనంతరం ఆ మహిళ దూరంగా ఉండి ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళుతున్నారో గమనిస్తోంది. పోలీసుల రాకను చూసి కొద్ది దూరం వెళ్లిపోయింది. అటుగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కింది. గతంలో పనిచేసిన యజమాని ఇంట్లో చోరీకి పాల్పడటంతో లక్షి్మపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement