తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు | Ias Officers Transfers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

Aug 31 2021 12:17 AM | Updated on Aug 31 2021 2:32 AM

Ias Officers Transfers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌ రావు.. వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారు లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసి ఆమె స్థానంలో వెయి టింగ్‌లో ఉన్న అనితా రామచంద్రన్‌ను నియమిం చింది. పరిశ్రమల శాఖ కమిషనర్‌ కె.మాణిక్‌ రాజ్‌ను ప్రభుత్వం బదిలీ చేసి తదుపరి పోస్టింగ్‌ను కేటాయించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ డి.కృష్ణ భాస్కర్‌ను ఆయన స్థానంలో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా నియమిం చింది. వెయిటింగ్‌లో ఉన్న వి.వెంకటేశ్వర్లును యువజన సేవల విభాగం డైరెక్టర్‌గా నియమించి, ఆ పోస్టు అదనపు బాధ్య తల నుంచి సవ్యసాచి ఘోష్‌ను తప్పించింది. వెయి టింగ్‌లో ఉన్న మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ను మైనారిటీల సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ గా నియమించింది. 

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు ..
నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. జనగామ జిల్లా కలెక్టర్‌ కె.నిఖిల వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా స్థానచలనం పొందారు. రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝా కూడా బదిలీ అయ్యారు. ఆమెకు ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆమె స్థానంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరు క్రాంతి నియుక్తులయ్యారు. ఇక వ్యవసాయ శాఖ డెప్యూటీ కార్యదర్శి సీహెచ్‌ శివలింగయ్య జనగామ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ హరితను బదిలీ చేసిన ప్రభుత్వం తదుపరి పోస్టింగ్‌ ఇవ్వలేదు. నిజాంపేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బి.గోపి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న కె.శశాంకను మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ గా ప్రభుత్వం బదిలీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement