సాక్షి, హైదరాబాద్: పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్‌లోని బేబీ పాండ్స్ (కృత్రిమ గుంటల) వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(21వ తేదీ బుధవారం) మధ్యాహ్నం 3 గంటల గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
👉పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వి.వి. విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు (ఈ మార్గంలో అమ్మవారి విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది).
👉నిరంకారి జంక్షన్ నుండి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత పి.ఎస్. సైఫాబాద్ వద్ద రవీంద్ర భారతి మరియు మాసాబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తారు (ఇక్బాల్ మినార్ వైపు కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు).
👉ఇక్బాల్ మినార్ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
👉ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, మింట్ కాంపౌండ్ నుండి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద మింట్ కాంపౌండ, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు.
👉అప్పర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు.
👉లిబర్టీ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు (పాత అంబేద్కర్ విగ్రహం – సెక్రటేరియట్ జంక్షన్ – ఎన్టీఆర్ మార్గ్ – నెక్లెస్ రోడ్డు వైపు కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు).
👉అప్పర్ ట్యాంక్ నుండి నల్లగుట్ట బ్రిడ్జ్ మరియు పి.వి. మార్గ్ (నెక్లెస్ రోడ్డు) వైపు వచ్చే ట్రాఫిక్‌ను సోనాబీ అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్ రోడ్డు (కార్బాలా - రాణిగంజ్ మీదుగా) వైపు మళ్లిస్తారు.
👉రాణిగంజ్. మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట 'ఎక్స్' రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు పై జంక్షన్ల వైపు వెళ్లకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..!


