breaking news
idol immersion
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోడ్లన్నీ బంద్
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్‌లోని బేబీ పాండ్స్ (కృత్రిమ గుంటల) వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(21వ తేదీ బుధవారం) మధ్యాహ్నం 3 గంటల గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారుట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. 👉పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వి.వి. విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు (ఈ మార్గంలో అమ్మవారి విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది).👉నిరంకారి జంక్షన్ నుండి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత పి.ఎస్. సైఫాబాద్ వద్ద రవీంద్ర భారతి మరియు మాసాబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తారు (ఇక్బాల్ మినార్ వైపు కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు).👉ఇక్బాల్ మినార్ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.👉ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, మింట్ కాంపౌండ్ నుండి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద మింట్ కాంపౌండ, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు.👉అప్పర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు.👉లిబర్టీ నుండి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు (పాత అంబేద్కర్ విగ్రహం – సెక్రటేరియట్ జంక్షన్ – ఎన్టీఆర్ మార్గ్ – నెక్లెస్ రోడ్డు వైపు కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు).👉అప్పర్ ట్యాంక్ నుండి నల్లగుట్ట బ్రిడ్జ్ మరియు పి.వి. మార్గ్ (నెక్లెస్ రోడ్డు) వైపు వచ్చే ట్రాఫిక్‌ను సోనాబీ అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్ రోడ్డు (కార్బాలా - రాణిగంజ్ మీదుగా) వైపు మళ్లిస్తారు.👉రాణిగంజ్. మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట 'ఎక్స్' రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు పై జంక్షన్ల వైపు వెళ్లకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..! -
నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం
-
నిర్విఘ్నం.. నిమజ్జనం
ఖైరతాబాద్/లక్డీకాపూల్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయింది. 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టాన్ని కేవలం 6 గంటల 20 నిమిషాల్లో పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకోగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మధ్యాహ్నం 2:45 నిమిషాలకు నిమజ్జనం పూర్తయింది. శోభాయాత్ర ఇలా... ⇒ గురువారం అర్ధరాత్రి తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని భారీ వాహనంపై ఉంచారు. అంతకుముందే రాత్రి 8 గంటలకు కలశపూజ నిర్వహించి విగ్రహ నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, మహాగణపతిని లిఫ్ట్ చేసి వాహనంపై ఉంచే క్రేన్‌కు సాంకేతిక లోపం రావడంతో ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైంది. మహాగణపతి 2:45 నిమిషాల సమయంలో.. అధికారులు అప్పటికే మార్క్ చేసి ఏర్పాటు చేసిన రెడ్ ఫ్లాగ్‌ల మధ్యలో నీటిని తాకుతూ మెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. గత సంవత్సరం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు సంపూర్ణ నిమజ్జనం కాగా, ఈ సంవత్సరం గంట ఆలస్యంగా నిమజ్జనం పూర్తయింది. ⇒ మహాగణపతిని పైకి లిఫ్ట్ చేసి 30 నిమిషాలు గాల్లోనే ఉంచి నలువైపులా తిప్పుతూ గంగమ్మ ఒడిలో మార్క్ చేసిన ప్రాంతంలో నిమజ్జనం చేశారు. క్రేన్ ఆపరేటర్ బల్విందర్‌సింగ్ చాకచక్యంగా మహాగణపతి నిమజ్జనం చేయించారు. ⇒ ఎలాంటి విఘ్నాలు లేకుండా నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు, అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు సంతోషంగా డ్యాన్స్ చేశారు. పాటలకు స్టెప్పులు వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయింది : మంత్రి పొన్నం హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనోత్సవం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. శుక్రవారం నగరంలో గంట పాటు నిమజ్జన ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరిశీలించారు.ఏరియల్ వ్యూ అనంతరం బేగంపేట విమానాశ్రయంలో మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతో కలసి మంత్రి పొన్నం మాట్లాడారు. 11వ రోజు గణేశ్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత రూట్లు, నిర్దేశించిన పాయింట్లలో నిరంతరం వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయండి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సహకరించి విగ్రహాల మూమెంట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం లేదా వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ ఏడాది పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు : డీజీపీ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు.గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. ఇంకా మిగతా విగ్రహాలు శనివారం ఉదయానికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. 13 మంది మృతి.. గణేశ్ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్ఐ వెంకన్న మృతి బాధాకరమన్నారు. సైబరాబాద్ పరిధిలోని పటాన్చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతి చెందగా, నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్టు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్టు పేర్కొన్నారు. మొత్తం 26 మంది ప్రమాదాల్లో గాయపడగా, మల్కాజిగిరిలో 17 మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు. -
ఆలస్యమైనా.. త్వరగా ముగిశాయి!
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6.30కి ప్రారంభించాల్సి ఉండగా, 7.30కి ప్రారంభమైంది. ని మజ్జనం మధ్యాహ్నం 1.30కి పూర్తికావాలని టార్గెట్‌గా పెట్టుకున్నా 1:05 గంటలకే పూర్తి చేయగలిగారు. ఇక, బాలాపూర్ గణపతి శోభాయాత్ర కొన్ని అడ్డంకుల వల్ల రెండు గంటలు ఆలస్యమైనా సాయంత్రం 6:11 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. నగరంలో మొత్తం 12,030 విగ్రహాలు నమోదు కాగా శుక్రవారం వరకు 7,500, శనివారం సాయంత్రానికి మరో 650 నిమజ్జనమయ్యాయి. పెద్ద విగ్రహాల్లో ఇంకా 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది. ప్రశాంతంగా నిమజ్జనాలు: డీజీపీ రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వి నాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియను.. శనివారం డీజీపీ తన కార్యాలయంలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో సమీక్షించారు. అనంతరం శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ ఎం భగవత్, పీఅండ్ ఎల్ఐజీ ఎం.రమేశ్, శాంతి భద్రతల ఏఐజీ రమణకుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో నిమజ్జనోత్సవాలను సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ, డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భద్రత విధుల్లో పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీ, ఆరీ్పఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్లు తదితర శాఖల సిబ్బంది కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ఈసారి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిమజ్జనం విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు సూచిస్తున్న భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ కోరారు. బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలుసొంతం చేసుకున్న దశరథ్‌గౌడ్ బడంగ్పేట్: ఎంతో ఉత్కంఠగా ఎ దురు చూసిన బా లాపూర్ గణనాథు డి లడ్డూను కర్మన్ ఘాట్‌కు చెందిన చైతన్య స్టీల్, సి మెంట్ వ్యాపారి లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.5 లక్షలు అధికంగా పలకడం విశేషం. ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్య క్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి.. లడ్డూ గ్రహీతను ఘనంగా సన్మానించారు. -
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
కోల్‌కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now. I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 5, 2022 8 Dead, Several Missing During Idol Immersion In West Bengal. #JalpaiguriAccident #Jalpaiguri pic.twitter.com/hTgAAJvYmq — Jagadanand Pradhan (@JPradhan_) October 6, 2022 Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi — PMO India (@PMOIndia) October 5, 2022 -
నిమజ్జనంలో అపశృతి.. 10 మంది మృతి
రాంచీ: జార్ఖండ్ లో సరస్వతీ నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గిరిధ్ జిల్లాలో సరస్వతీ నిమజ్జనం నిర్వహిస్తుండగా సంభవించిన ప్రమాదంలో పది మంది మృతిచెందగా, మరో 15 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల మృతి పట్ల జార్ఘండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సంతాపం ప్రకటించారు. జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. సరస్వతీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఓ గుంపు వెళ్తుండగా గిరిధ్-బగోదర్ గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు చేరుకోగానే ఓ ట్రక్కు అదుపుతప్పి వీరి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారని డిప్యూటీ కమిషనర్ ఉమా శంకర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే డీఎస్పీ దీపక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.


