
ప్రశాంతంగా ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం
తన కార్యాలయంలో పరిస్థితిని సమీక్షించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6.30కి ప్రారంభించాల్సి ఉండగా, 7.30కి ప్రారంభమైంది. ని మజ్జనం మధ్యాహ్నం 1.30కి పూర్తికావాలని టార్గెట్‌గా పెట్టుకున్నా 1:05 గంటలకే పూర్తి చేయగలిగారు. ఇక, బాలాపూర్ గణపతి శోభాయాత్ర కొన్ని అడ్డంకుల వల్ల రెండు గంటలు ఆలస్యమైనా సాయంత్రం 6:11 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. నగరంలో మొత్తం 12,030 విగ్రహాలు నమోదు కాగా శుక్రవారం వరకు 7,500, శనివారం సాయంత్రానికి మరో 650 నిమజ్జనమయ్యాయి. పెద్ద విగ్రహాల్లో ఇంకా 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది.
ప్రశాంతంగా నిమజ్జనాలు: డీజీపీ
రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వి నాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియను.. శనివారం డీజీపీ తన కార్యాలయంలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో సమీక్షించారు. అనంతరం శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ ఎం భగవత్, పీఅండ్ ఎల్‌ఐజీ ఎం.రమేశ్, శాంతి భద్రతల ఏఐజీ రమణకుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో నిమజ్జనోత్సవాలను సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ, డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భద్రత విధుల్లో పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీ, ఆరీ్పఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్లు తదితర శాఖల సిబ్బంది కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ఈసారి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా నిమజ్జనం విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు సూచిస్తున్న భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ కోరారు.
బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు
సొంతం చేసుకున్న దశరథ్‌గౌడ్
బడంగ్‌పేట్: ఎంతో ఉత్కంఠగా ఎ దురు చూసిన బా లాపూర్ గణనాథు డి లడ్డూను కర్మన్ ఘాట్‌కు చెందిన చైతన్య స్టీల్, సి మెంట్ వ్యాపారి లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.5 లక్షలు అధికంగా పలకడం విశేషం. ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్య క్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి.. లడ్డూ గ్రహీతను ఘనంగా సన్మానించారు.