
సాక్షి, బాలాపూర్: బాలాపూర్ లడ్డూకు మరోసారి రికార్డు స్థాయిలో వేలం జరిగింది. ఈ ఏడాది గణేషుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలు పలికింది. ఈరోజు జరిగిన వేలంలో లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు.
ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం పోటాపోటీగా వేలం జరిగింది. ఈ ఏడాది వేలంలో 38 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇక, ఈసారి వేలంలో లడ్డూ రూ.35 లక్షలు పలికింది. బాలాపూర్ గణేశ్ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథగౌడ్ దక్కించుకున్నారు. అనంతరం, లడ్డూ విజేత లింగాల దశరథగౌడ్‌ను ఉత్సవ కమిటీ సన్మానించింది. గతేడాది కంటే రూ.4.99 లక్షల ధర అధికంగా పలికింది. ఈ సందర్భంగా దశరథ్ గౌడ్ మాట్లాడుతూ.. లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా చాలా ఉంది. గత ఐదేళ్లుగా లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా..
- 31 ఏళ్లుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట జరుగుతోంది.
- 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
- గతేడాది రికార్డుస్థాయిలో 30.01 లక్షలు ధర పలికింది.
- 2023లో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
- 2022లో రూ.24.60 లక్షలు పలికిన లడ్డ
- 2021లో రూ. 18.90 లక్షలు,
- 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి
- 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- 2016లో రూ. 14. 65 లక్షలు, 2017లో రూ. 15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట

The highly popular auction which attracts nationwide attention, ''Balapur Ganesh Laddu'' was auctioned at an all-time record of Rs 35 Lakh in an open auction held on Saturday, highest in the last 30 years. The 21-kg famed laddu was bagged by Lingala Dasrath Goud of Karmanghat,… pic.twitter.com/rwz9GxysFm
— Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2025