
హైదరాబాద్: హిందూ శ్మశానవాటికల్లో సోమవారం రాత్రి దీపావళి పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుటుంబీకులు సమాధులను పూలమాలలతో సుందరంగా అలంకరించి పితృ దేవతలకు నైవేద్యాలు సమరి్పంచారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని హిందూ శ్మశానవాటికతో పాటు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–13లోని హిందూ శ్మశానవాటికలు దీపావళి సందర్భంగా సమాధులన్నీ బంతిపూల మాలలతో సుందరంగా అలంకరించగా అర్ధరాత్రి దాకా సందడిగా శ్మశానంలోనే పండుగ వాతావరణంలో నిర్వహించారు. తమ పూరీ్వకులను స్మరించుకుంటూ కుటుంబీకులంతా సమాధుల వద్ద దీపాలు వెలిగించి నివాళులర్పించారు.
సాధారణంగా అర్ధరాత్రి శ్మశానంలో అడుగుపెట్టాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ బంజారాహిల్స్‌లోని ఈ మూడు శ్మశానవాటికల్లో మాత్రం ఎనిమిది దశాబ్దాలుగా శ్మశానాల్లోనే దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉన్నా దీపావళి రోజు మాత్రం తప్పకుండా వచ్చి సమాధులను అలంకరించి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి నైవేద్యాలు సమరి్పంచి సామూహిక భోజనాలు చేయడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని భగవాన్‌దాస్ అనే స్థానికుడు తెలిపారు. పూరీ్వకులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని వీరు పేర్కొంటున్నారు.