
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం (సెప్టెంబర్ 22) ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్ రావుకు కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎస్ హరీశ్‌కు, గనులశాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను సర్కార్ రిలీవ్ చేసింది. మైన్స్ అండ్ జియాలజి డైరెక్టర్ గా భావేష్ మిశ్రాను నియమించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను గరిమా అగర్వాల్‌కు అప్పగించింది. గరిమా అగర్వాల్ ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. కాగా, సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.