TG: ‘అన్ని ఆర్టీఏ చెక్‌ పోస్టులను తక్షణం మూసివేయండి’ | Telangana Orders Immediate Closure of All RTA Checkposts | Sakshi
Sakshi News home page

TG: ‘అన్ని ఆర్టీఏ చెక్‌ పోస్టులను తక్షణం మూసివేయండి’

Oct 22 2025 3:30 PM | Updated on Oct 22 2025 3:57 PM

RTA Check Posts Across Telangana To Be Closed

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్‌ పోస్టులు తక్షణం మూసిఏయాలనే ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోరి అన్ని ట్రాన్స్‌పోర్ట్‌ చెక్‌పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలి. చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని పేర్కొంది. 

‘చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలి. ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలి. చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజే సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి’ అని ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. 

తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెకోపోస్టులు మూసివేత

ఇదీ చదవండిL 

ఆర్టీఏ చెక్‌  పోస్టుల్లో ఏసీబీ సోదాలు..


దానం సపోర్ట్‌ చేస్తే తప్పేంటి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement