నిమజ్జనంలో అపశృతి.. 10 మంది మృతి | 10 killed during idol immersion in Jharkhand | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో అపశృతి.. 10 మంది మృతి

Feb 14 2016 9:49 PM | Updated on Sep 3 2017 5:39 PM

జార్ఖండ్ లో సరస్వతీ నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.

రాంచీ: జార్ఖండ్ లో సరస్వతీ నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గిరిధ్ జిల్లాలో సరస్వతీ నిమజ్జనం నిర్వహిస్తుండగా  సంభవించిన ప్రమాదంలో పది మంది మృతిచెందగా, మరో 15 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల మృతి పట్ల జార్ఘండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సంతాపం ప్రకటించారు. జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఈ వివరాలు వెల్లడించారు.

సరస్వతీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఓ గుంపు వెళ్తుండగా గిరిధ్-బగోదర్ గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు చేరుకోగానే ఓ ట్రక్కు అదుపుతప్పి వీరి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారని డిప్యూటీ కమిషనర్ ఉమా శంకర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే డీఎస్పీ దీపక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement