బాలుడిపై లైంగిక దాడి కేసు.. ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు  | Hyderabad Madrasa Teacher Sentenced To 20 Years For Sexual Assault Of Minor, More Details Inside | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగిక దాడి కేసు.. ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు 

Jul 3 2026 8:05 AM | Updated on Jul 3 2026 9:53 AM

hyderabad pocso case madrasa teacher gets 20 years jail

హైదరాబాద్‌: మైనర్‌ బాలుడిపై  లైంగిక దాడికి పాల్పడిన మదర్సా ఉపాధ్యాయుడికి నాంపల్లి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బండ్లగూడ  ఇన్‌స్పెక్టర్‌  దేవేందర్‌ తెలిపిన మేరకు.. క్యూబా కాలనీకి చెందిన సయ్యద్‌ నదీం(22) షాహిన్‌నగర్‌ అలైన్‌ హిల్స్‌లోని ఓ మదార్సాలో ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు.

 ఇదే మదర్సాలో విద్యనభ్యసిస్తున్న బాలుడి(11)ని  2022 మార్చిలో ఇంటికి తీసుకెళ్లి అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోక్సో కింద కేసు నమోదు చేసి నాంపల్లి పోక్సో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.  నాంపల్లి పోక్సో కేసులు 12వ ఏఎస్‌జే కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చన కుమారీ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement