Photo Feature: అధికారులూ! మేల్కోండి..!!! గుడిలో బడి

Hyderabad: Photo Feature Of School Students Studies Temple  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇది బంజారాహిల్స్‌లోని కట్టమైసమ్మ గుడి. ఈ ఆలయ ఆవరణలో సుమారు 250 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అదేంటి?.. గుడిలో పిల్లలు  చదువుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజమే. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో స్థానిక ఉదయ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగేది.

మొన్నటిదాకా ఇక్కడ 100 మంది పిల్లలు మాత్రమే ఉండేవారు. ఈ ఏడాది కొత్త అడ్మిషన్లతో విద్యార్థుల సంఖ్య 250కి చేరింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్‌ లేకపోవడంతో దీనికి ఆనుకుని ఉన్న కట్టమైసమ్మ గుడి ఆవరణలోనే టీచర్లు చదువు చెబుతున్నారు. గుడిలో ఫంక్షన్లు జరిగిన సందర్భాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. 250 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, రెండు గదులు మాత్రమే ఉండటం గమనార్హం. ఒకవైపు మన బస్తీ.. మన బడి కార్యక్రమంతో సర్కారు బడులను బాగు చేస్తున్న ప్రభుత్వం ఇక్కడో బడి నిర్మిస్తే బావుటుంది. అధికారులూ! మేల్కోండి...!!!

చదవండి: కానిస్టేబుల్‌పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top