పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ హాజరయ్యేనా?  | Hyderabad MLC Elections 2025 | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ హాజరయ్యేనా? 

Apr 15 2025 7:28 AM | Updated on Apr 15 2025 7:28 AM

Hyderabad MLC Elections 2025

 బీజేపీకి మద్దతు లభించేనా.. 

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ హాజరయ్యేనా? 

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఊహాగానాలు  

 

సాక్షి,హైదరాబాద్‌: త్వరలో జరగనున్న హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం గెలిచేందుకు అవసరమైన ఓటర్ల సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ బరిలో దిగడమే.  ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు హైదరాబాద్‌ ‘స్థానిక’ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. 

ఆ లెక్కన మొత్తం ఓటర్లలో అత్యధికంగా 49 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో ఆ పార్టీకి, దానికి మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్‌కు చెందిన 14 ఓట్లు ఎంఐఎంకు లభించే అవకాశాలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ, కమలం పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో బీజేపీ ఏ ధీమాతో, ఏ నమ్మకంతో పోటీలో నిలిచిందనేది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న తలెత్తుతోంది.

ఎవరికి ఎవరో.. 
మరో వైపు కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌.. బీజేపీ ఈ మూడూ దేనికవిగా మిగతా రెండూ కలిసి పని చేస్తున్నాయని ఎంతో కాలంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. మిగతా రెండూ ఒకటేనని, తమ పార్టీ మాత్రమే వాటికి వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తోందని మూడు పారీ్టల నేతలూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో  ఎవరికి ఎవరు మద్దతుగా నిలుస్తారో, ఎవరిని వ్యతిరేకిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అంత నమ్మకం లేనిదే బీజేపీ ఎందుకు పోటీలో ఉంటుందని, మిగతా పార్టీల నుంచి తగిన హామీ లభించి ఉండవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. ఈ ఎన్నికను సైతం ఆయా పార్టీలు, ప్రజలు పారీ్టలపరంగా  చూస్తున్పటికీ, పోటీలో ఉన్న అభ్యర్థులను కానీ.. ఓటర్ల జాబితాలో కానీ వారి పేర్లు, చిరునామాలు తప్ప ఏ పారీ్టయో వెల్లడించరు. కనీసం ఏ డివిజన్‌ కార్పొరేటరో కూడా జాబితాలో ఉండదు. విప్‌ వంటివి వర్తించవు.

ఆత్మ ప్రబోధానుసారంగా? 
జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో సైతం పార్టీ  మారిన వారు ఒకే చోట కూర్చుంటారు తప్ప అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పారీ్టల వారీగా అభ్యర్థులను పేర్కొంటారు తప్ప.. తర్వాత పార్టీ మారినా అధికారికంగా దాన్ని ప్రకటించరు. పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యరి్థకి కానీ, తమ పార్టీ అధిష్ఠానం సూచించిన వారికి కానీ కచి్చతంగా ఓటేయాల్సిన పరిస్థితి  ఓటర్లకు లేదు. అందువల్లే బీజేపీ ధీమాగా ఉందని చెబుతున్నారు.  

   అంతేకాదు.. ఇటీవల  బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎంను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో అసలీ ఎన్నికలో ఏం జరగనుందో అంతుచిక్కడం లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా గుర్తించలేరు. పారీ్టలు సైతం ఫలానా వారికే ఓటేయాలని ఇంతవరకు చెప్పలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో అంతుపట్టడం లేదు. 

 బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్‌ మద్దతు ఎంఐఎంకు ఉంది. జీహెచ్‌ంఎసీ స్టాండింగ్‌కమిటీ ఎన్నికలోనూ అది వెల్లడైంది.  కాబట్టి కాంగ్రెస్‌ మద్దతిచ్చే ఎంఐఎంకు బీఆర్‌ఎస్‌ సైతం మద్దతిస్తుందా, లేక పోలింగ్‌కు దూరంగా ఉంటుందా అన్నది తెలియడానికి ఇంకా సమయం పట్టనుంది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం కూడా ప్రారంభం కావచ్చని ఆశిస్తున్నవారూ ఉన్నారు. ప్రలోభాలను సైతం ఆత్మప్రబోధంగా చెబుతారని కార్పొరేటరొకరు వ్యాఖ్యానించారు. పారీ్టల పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌కు 24 ఓట్లు, బీజేపీకి 25 ఓట్ల బలం ఉంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement