సాక్షి, హైదరాబాద్: బేగంపేట ప్లై ఓవర్‌పై ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి.. కారు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
మరో ఘటనలో ఈ నెల 18న ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్‌లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్‌కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్‌లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


